AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దీపావళి వేళ పవన్ కళ్యాణ్‌ ఎమోషనల్ ట్వీట్.. చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడి ప్రశంసలు

దేశవ్యాప్తంగా హిందువులంతా  దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఇంటా దివ్వెల వెలుగులు విరజిమ్ముతున్నాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ టపాసులు కాలుస్తూ దీపావళిని జరుపుకుంటున్నారు. ప్రముఖులంతా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే.. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్… ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాకిస్థాన్‌కు చెందిన ఓ పిల్లాడు పాడిన ఓ పాటకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. హిందువులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్.

“పాకిస్థాన్‌కు చెందిన హిందూ పిల్లల ఈ పాట వారి బాధను ప్రతిబింబిస్తోంది. భారత్‌లో మళ్లీ కలవాలనే కోరిక కనిపిస్తోంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందువులకు నా హృదయపూర్వక ‘దీపావళి’ శుభాకాంక్షలు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లోని హిందువుల కోసం.. మీరు ఉన్న పరిస్థితిలో శ్రీరాముడు మీకు బలం, ధైర్యాన్ని ప్రసాదించాలి. భారత్‌లో మేమంతా మీ భద్రత, స్థిరత్వం కోసం ఎదురుచూస్తూ.. ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాం.

తమ భద్రత, ప్రాథమిక హక్కుల కోసం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో పోరాడుతున్న హిందువులను ప్రపంచంలో గొప్ప గొప్ప నాయకులు.. చేరుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ రోజు దీపావళి రోజున, బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండింటిలోనూ హింసకు గురవుతున్న హిందువుల భద్రత కోసం అందరం ప్రార్థిద్దాం. వారి భూములలో ధర్మాన్ని పునరుద్ధరింపబడాలని కోరుకుందాం.” అంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్టు పెట్టారు.

ANN TOP 10