– ముఖ్యమంత్రిని కలిసి చెక్కు అందజేసిన నటుడు మహేశ్‌బాబు దంపతులు
– ఏఎంబీ తరపున మరో రూ.10 లక్షలు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
వరద బాధితుల సహాయార్థం నటుడు మహేశ్ బాబు దంపతులు రూ.50 లక్షలు అందజేశారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. చిరంజీవి, బాలకృష్ణ, విశ్వక్‌సేన్, సాయిధరమ్ తేజ్ సహా పలువురు నటులు సీఎం సహాయ నిధికి తమ వంతు సాయం అందించిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు కూడా సీఎం సహాయ నిధికి విరాళం అందించారు.
మహేశ్ బాబు సోమవారం ఉదయం తన సతీమణి నమ్రతతో కలిసి జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎంను కలిసి వరద బాధితుల సహాయార్థం విరాళం అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల చెక్కును అందజేశారు. ఏఎంబీ సినిమాస్ తరపున మరో రూ.10లక్షలు విరాళంగా ఇచ్చారు.
సీఎం కృతజ్ఞతలు..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ బాబు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇలాంటి సమయంలో సినీ నటులు కూడా తమ వంతు సహాయాన్ని అందించడంలో ముందుండటం గర్వకారమని.. మహేష్ నమ్రత దంపతులను అభినందించారు. మహేష్ బాబు చేసిన ఈ సహాయం పునరావాస కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.