ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజు వైసీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా.. ఈ విధంగా స్పందించారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మన పార్టీ మంచి చేసిందన్నారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటు కానుందని, మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకు వస్తుందని సీఎం జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో ప్రమాణస్వీకారం చేసిన ఫొటోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లలో 151 గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.









