స్టీల్‌ప్లాంట్ కార్మికులు బతుకులు రోడ్ల మీద పెట్టేశారని ఆరోపించారు మాజీ సీఎం జగన్. తప్పుడు మాటలతో నమ్మించి చివరకు కార్మికులు మృత్యువాత పడేటట్లు చేస్తున్నారని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్ ఘటనలో బాధిత కుటుంబాలను సెవెన్ హిల్స్ హాస్పిటల్ లో పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి జగన్. చికిత్స పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే చనిపోయిన కార్మిక కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
విశాఖలో మాజీ సీఎం జగన్.. స్టీల్‌ప్లాంట్ ఘటన బాధితులకు పరామర్శ
విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టీల్‌ప్లాంట్ బాధితులను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన, ప్రమాదం జరిగిన తీరు చాలా బాధాకరమన్నారు. లిక్విడ్ బకెట్లలో పోసింది.. పొంగి బ్లాస్ట్ అయ్యిందన్నారు. ఇందులో కార్మికుల తప్పలేదని తేల్చేశారు. ఇలాంటి ఘటనలలో మానవత్వం చూపించవలసిన సమయంలో రాజకీయ చేయడం దుర దృష్టకరమన్నారు.
చనిపోయిన మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారంలో పెద్ద డ్రామా చేశారని ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్ కర్మాగారం నుండి రూ25 లక్షల ఇస్తున్నారని, కూటమి ప్రభుత్వం పెద్దగా ఇచ్చేదేముందని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులకు కోటి రూపాయలు పరిహారం ఇప్పించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
స్టీల్‌ప్లాంట్ ఫ్యూచర్‌పై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు, కూటమి ప్రభుత్వంపై రుసరుసలు
ఈ విషయంలో వాళ్ళకు రావలసిన డబ్బులు వస్తున్నాయని, సీఎం చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు. బాధితులకు న్యాయం చేయకపోతే ఉపేక్షించేది లేదని కుండబద్దలు కొట్టేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వకుంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే తప్పకుండా కోటి రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు. అదే సమయంలో స్టీల్‌ప్లాంట్ ఫ్యూచర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ప్రధాని సమక్షంలో స్టీల్‌ప్లాంట్ ప్రవేటీకరణం ఆపాలని సభలో కోరామని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి 28 వేల మంది కార్మికులు ఉన్నారని వివరించారు. రెండేళ్లలో 10,500 మందిని తొలగించారని ఆరోపించారు.
వీఆర్‌ఎస్ పేరుతో 1800 మందిపై ఒత్తిడి చేశారని, ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంఖ్యను 16 వేలకు కుదించారని కొత్త లెక్కలు చెప్పారు. స్టీల్‌ప్లాంట్ కోసం కేంద్రం ఇచ్చిన 11,440 కోట్ల ప్యాకేజ్.. మెయింటెనెన్స్ కోసం కాదని, వీఆర్ఎస్‌పై పంపేందుకు, బ్యాంక్ లోన్ల కోసమేనంటూ కొత్త విషయాలు వెల్లడించారు.
వీటి కోసం ప్యాకేజీ ఇచ్చారే తప్పా, సేఫ్టీని పెంచేందుకు కాదన్నారు. కార్మికుల సమస్యల గురించి కాదన్నారు. మంత్రి లోకేశ్ మాటలు దారుణంగా ఉన్నాయని, వాటిని చూస్తే ఆశ్చర్యం వేసిందని, ఇలాంటి మనుషులు ఉంటారా? అనిపించింద్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ఇస్తారో చెప్పమంటే కనీసం స్పందించలేదన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెనుదిరిగారు మాజీ సీఎం.








