నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ అనగానే టాలీవుడ్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ (2023 జనవరి 12న విడుదల) బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్ను రిపీట్ చేయడానికి, అంతకుమించిన హై వోల్టేజ్ యాక్షన్ను వెండితెరపై ఆవిష్కరించడానికి ఈ క్రేజీ కాంబో మళ్లీ జతకట్టింది.
ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన #NBK111 గ్లింప్స్ – ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అసలు సిసలైన నందమూరి మార్క్ మాస్ ఎలిమెంట్స్తో కూడిన ఈ గ్లింప్స్ ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతూ వ్యూస్ పరంగా రికార్డులు తిరగరాస్తోంది.
అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్న యాక్షన్ గ్లింప్స్
వదిలిన ఈ చిన్న గ్లిప్స్ బాలకృష్ణ ఎనర్జీ, ఆయన మేకోవర్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ఒక పవర్ఫుల్ బ్యాక్డ్రాప్లో, గోపీచంద్ మలినేని మార్క్ టేకింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా బాలయ్య సినిమా గ్లింప్స్ అంటేనే డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ గ్లింప్స్లో కూడా బాలకృష్ణ చేసిన యాక్షన్ సీక్వెన్స్
చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ వేయించడం ఖాయమనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన నడిచి వస్తున్న తీరు, కళ్లలో కనిపిస్తున్న ఇంటెన్సిటీ నందమూరి అభిమానులకు మాంచి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి.. అఖండ’, ‘భగవంత్ కేసరి’ వీరసింహ రెడ్డి,అఖండ 2 వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్బస్టర్స్ అందుకున్న బాలయ్య, ఈ సరికొత్త లుక్లో మరింత యంగ్గా, పవర్ఫుల్గా కనిపిస్తూ బాక్సాఫీస్ వేటను అప్పుడే మొదలుపెట్టినట్టు హింట్ ఇచ్చేసినట్టే కనిపిస్తుంది.
గ్లింప్స్ ని మరో లెవెల్ కి తీసికెళ్ళిన తమన్
ఈ చిత్రానికి మరో మెయిన్ ఎసెట్ సంగీత దర్శకుడు థమన్ ఎస్. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలకు థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమా విజయాల్లో ఎంత కీలక పాత్ర పోషించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు #NBK111 గ్లింప్స్ కోసం కూడా థమన్ తన మార్క్ రీ-రికార్డింగ్తో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ను గుర్తుచేశారు. గ్లింప్స్ ప్రారంభం నుండి ముగింపు వరకు వచ్చే ప్రతి బీట్ నెక్స్ట్ లెవెల్ . బాలకృష్ణ ఎలివేషన్ సీన్స్కు థమన్ ఇచ్చిన బేస్ మ్యూజిక్, సౌండ్ డిజైన్ ఈ వీడియోను లూప్లో చూసేలా చేస్తున్నాయి.
ఇక గోపీచంద్ మలినేని గతంలో ‘క్రాక్’ (2021 జనవరి 9) చిత్రంతో మాస్ పల్స్ ఏంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత బాలయ్యతో చేసిన ‘వీరసింహారెడ్డి’తో కమర్షియల్ సక్సెస్ ఫార్ములాను నూటికి నూరు పాళ్లు పండించారు. ఇప్పుడు #NBK111 విషయంలో కూడా ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, బాలయ్య ఇమేజ్కు సరిగ్గా సరిపోయే పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ను రెడీ చేసినట్టు ఈ గ్లింప్స్ ద్వారా స్పష్టమవుతోంది. నిర్మాతలు కూడా ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజువల్స్ చూస్తుంటేనే సినిమా నిర్మాణ విలువలు ఎంత గ్రాండ్గా ఉన్నాయో అర్థమవుతోంది.
ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడతాయో
ప్రస్తుతం ఈ ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ గ్లింప్స్ యూట్యూబ్ ట్రెండింగ్లో టాప్లో దూసుకుపోతోంది. ఇక ఈ గ్లింప్స్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. బాలకృష్ణ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచేలా ఈ చిత్రం రూపొందుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమా నుండి రాబోయే టీజర్, ట్రైలర్, పాటలు ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడతాయో చూడాలి.








