AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దివ్యాంగుల పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన కంది శ్రీ‌నివాస రెడ్డి

ప‌ట్ట‌ణంలోని హ్యాండిక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ స‌భ్యులు అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డిని క్యాంపు కార్యాల‌యంలో క‌లిసారు.దివ్యాంగుల చ‌ట్టం 1995 ,2016 సెక్ష‌న్ 92 పై అవ‌గాహ‌న ప‌త్రం పోస్ట‌ర్ ను ఫౌండ‌ర్ ప్రెసిడెంట్ మ‌హ్మ‌ద్ ఇమ్రాన్ , సెక్ర‌ట‌రీ ఫైజ‌ల్ అహ్మ‌ద్ తో క‌లిసి కంది శ్రీ‌నివాస రెడ్డి ఆవిష్క‌రించారు. దివ్యాంగుల సంక్షేమానికి త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆయ‌న అన్నారు. చ‌ట్టం ప్ర‌కారం దివ్యాంగుల‌కు అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్,ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా రంగినేని శాంతన్ రావ్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండి దేవిదాస్ చారి,శ్రీలేఖ ఆదివాసీ,పోరెడ్డి కిషన్,నాగన్న,మునిగేల విట్టల్,కయ్యుమ్,మొహమ్మద్ రఫీక్,సమీ ఉల్లా ఖాన్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ANN TOP 10