AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంపుతామంటూ బెదిరింపు ఫోన్లు.. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ట్వీట్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
అనేక నంబర్ల నుంచి చంపుతామంటూ బెదిరింపు ఫోన్లు వచ్చాయని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తెలిపారు.
ఈరోజు తనకు వివిధ ఫోన్‌ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్‌ వచ్చాయని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. తనకు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదన్నారు.

ఈ బెదిరింపులపై గతంలోనూ తాను ఫిర్యాదు చేశానని… కానీ పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తనకు వచ్చిన బెదిరింపులపై పోలీసులకు తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు.

తనకు వచ్చిన బెదిరింపులకు సంబంధించిన ఫోన్‌ నంబర్లను రాజాసింగ్‌ ట్వీట్‌లో వెల్లడించారు. ప్రధాని మోదీ, పీఎంవో ఇండియా, అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ సిటీ పోలీస్, తెలంగాణ సీఎంవోలను ఆయన ట్యాగ్‌ చేశారు.

ANN TOP 10