AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విచారణ చేపట్టలేం.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌‌ను స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరించింది. ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టబోమని స్పష్టం చేసింది. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్‌ ఇదివరకే అవకాశం ఇచ్చినందున ఈ పిటిషన్‌ను విచారించడం సాధ్యం కాదని తెలిపింది. ఇక లిక్కర్‌ పాలసీ కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. తన అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం మే 10న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో అప్పటి నుంచి ఆయన బయటే ఉన్నారు. అయితే గడువు ముగిసిన వెంటనే జూన్ 2న లొంగిపోవాలని బెయిల్ ఇచ్చే సమయంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య కారణాల దృష్ట్యా మరో వారం రోజులు బెయిల్ పొడిగించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

ANN TOP 10