AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

1200 మంది ఫోన్లు ట్యాప్.. ప్రణీత్ రావు వాంగ్మూలంలో సంచలనాలు!

ఫోన్ ట్యాపింగ్‌లో ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టినట్లు ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. కన్వర్జెన్స్ ఇన్నోవేషన్‌ ల్యాబ్ సాయం ద్వారా ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. ఈ ల్యాబ్‌కు సంబంధించిన శ్రీనివాస్, అనంతలో సహాయంతో ట్యాపింగ్‌ని విస్తృతం చేశామన్నారు. ప్రభాకర్ రావు సహాయంతో 17 సిస్టంల ద్వారా ట్యాపింగ్‌కు పాల్పడినట్టు వెల్లడించారు. 56 మంది ఎస్‌వోటీ సిబ్బందిని ఉపయోగించి ట్యా్పింగ్ చేశామన్నారు. సుమారు 1200 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జిలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు వాంగ్మూలంలో ప్రస్తవించారు.

8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నట్టు ప్రణీతరావు తెలిపారు. అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించిగా.. అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్టు చెప్పారు. ఆర్థిక ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు. పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామని తెలిపారు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి ట్యాపింగ్‌ని ఆఫ్ చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాపింగ్ ఆపాలని ప్రభాకర్ రావు చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రభాకర్ రావు రాజీనామా చేసే ముందు రికార్డులు ధ్వంసం చేయమన్నారని, ద్వంసం చేసి కొత్తవి అమర్చామన్నారు. ధ్వంసం చేసిన వాటిని నాగోల్, మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో పడేశామన్నారు. సీడీఆర్, ఐడీపీఆర్ డేటా మొత్తం కాల్చి వేశామని, ఫార్మాట్ చేసిన ఫోన్లు, పెన్ డ్రైవ్‌లను బేగంపేట నాలాలో పడేశామని ప్రణీత్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు పేర్కొన్నారు.

ANN TOP 10