AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నన్ను మోసం చేశారు.. నటుడు జగపతి బాబు కీలక వ్యాఖ్యలు

– త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతా

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నన్ను మోసం చేశారని నటుడు జగపతి బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియాలో వీడియో పోస్టు చేశారు. రియల్‌ ఎస్టేట్‌ మోసాలకు అంతులేకుండా పోతోందన్నారు. రియల్‌ ఎస్టేట్‌లో భారీగా మోసాలు జరుగుతున్నాయన్నారు. అభిమానులు, సామాన్య ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భూమి కొనేముందు రెరా నిబంధనలు గుర్తించి పూర్తిగా తెలుసుకోని ప్రాపర్టీ కొనాలన్నారు. తనను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మోసం చేశారని వాపోయారు. ఇటీవల ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి చెందిన యాడ్‌లో నటించానని చెప్పారు. చెక్కు విషయంలో వాళ్లు మోసం చేశారని తెలిపారు. తనను మోసగించిన వాళ్లు ఎవరు.. అసలు ఏం జరిగింది? వంటి విషయాలను త్వరలోనే బయటపెడతా అన్నారు. రియల్‌ ఎస్టేట్‌ గురించి ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డి కూడా హెచ్చరించారని జగపతి బాబు గుర్తు చేశారు.

ANN TOP 10