AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జగన్‌పై దాడి ఘటనలో కేసు నమోదు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై శనివారం జరిగిన రాళ్లదాడిపై పోలీసులు కేసు నమోదు చేసింది. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఆయన నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. దాడి ఘటనపై అజిత్‌సింగ్ నగర్ పోలీసులు హత్యాయత్నంగా కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 307 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా.. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. వెల్లంపల్లి స్టేట్ మెంట్‌ను రికార్డు చేసిన పోలీసులు ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దాడిలో జగన్ నుదుటికి గాయం కావడంతో ఆయన ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. 20 మంది సిబ్బంది ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంతోనే బస్సు యాత్రకు విరామం ప్రకటించింది. రేపటి నుంచి సీఎం బస్సు యాత్ర యథాతథాంగా కొనసాగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

*దాడి ఘటనపై సీఈసీ సీరియస్..*

ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఏకంగా సీఎంపై దాడి జరగడమేంటని సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్న ప్రధాని సభ, నిన్న సీఎం సభలో జరిగిన వరస ఘటనలపై విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని విజయవాడ పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాడికి సంబంధించి ప్రాథమిక నివేదికను విజయవాడ సీపీ క్రాంతి రాణా ఈ రోజు సాయంత్రానికి ఈసీకి అందజేయనున్నారు. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై సీఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ హింస పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన కొందరు పోలీస్‌ అధికారులపై సీఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ANN TOP 10