AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘దేశ కళ్యాణం, దేశ హితం కోసం మేనిఫెస్టో’

పార్లమెంట్ ఎన్నికల కోసం దేశ ప్రజల ముందు మేనిఫెస్టోను పెట్టామని, దేశ కళ్యాణం, దేశ హితం కోసం మేము మేనిఫెస్టో ప్రవేశ పెట్టామని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలు, మహిళలు, యువత, రైతులకు సంబంధించిన ప్రధాన అంశాలను మేనిఫెస్టోలో పెట్టామని అన్నారు. ముఖ్యంగా ఈ నాలుగు అంశాలపైనా రాబోయే ఐదేళ్లు పని చేస్తామన్నారు. రాబోయే ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ బియ్యం ఇస్తామని సంకల్ప పత్రంలో పెట్టామని, ఆయుష్మాన్ భారత్ ను పొడగించామన్నారు. ఇది పెద్ద నిర్ణయమన్నామని, తక్కువ ధరకు మెడిసిన్ అందించే స్కీమ్ ను తీసుకొస్తామన్నారు. గత పదేళ్లుగా నాలుగు కోట్ల ఇళ్లు కట్టామని, రాబోయే ఐదేళ్లల్లో మూడు కోట్ల ఇల్లు కట్టాలని నిర్ణయించామని చెప్పారు. ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎం లాంటి అగ్రశ్రేణి విద్యాసంస్థలను మరింతగా అభివృద్ధి చేయనున్నామన్నారు.

మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా సాధికారత కల్పిస్తామని, అన్ని రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని, వాటిని పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోస్ట్ ఆఫీస్ లను సోషల్ సెక్యూరిటీ కేంద్రాలుగా మారుస్తామన్నారు. రాబోయే రోజుల్లో పోస్ట్ ఆఫీస్‌లను స్మాల్ బ్యాంక్స్ లాగా చేస్తామని, బ్లూ రెవల్యూషన్ కింద ప్రపంచ దేశాలకు ఫిష్ ప్రోడక్ట్స్ ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గిగ్ వర్కర్స్, ఆటో, ట్రక్ కార్మికులకు ఇప్పటి వరకు ఎటువంటి చట్టబద్ధమైన విధానాలు లేవన్నారు. గిగ్ వర్కర్లకు వాళ్ల పిల్లలకు ఈ – శ్రామ్ కింద రిజిస్టర్ చేసి వారికి విద్యా వైద్య సహాయం చేస్తామని, ట్రైబల్ మినిస్ట్రీకి కు నిధులు పెంచుతామని హామీ ఇచ్చారు. ట్రైబల్ రీసెర్చ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు.

ANN TOP 10