ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖండించారు. దాడి చేయడం అప్రజాస్వామికం అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరిపైనైనా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని చెప్పారు. ఈ దాడిలో గాయపడిన జగన్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎవరైనా ప్రచారంలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవచ్చని, అంత మాత్రాన దాడులు ఎవరిపైన చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ దాడికి ఎవరు పాల్పడినా నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు.









