బీజేపీ మేనిఫెస్టో కాలం చెల్లిన చెక్కు
సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా
కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్సే అంటూ స్పష్టీకరణ
(అమ్మన్యూస్, హైదరాబాద్):
బీజేపీ మేనిఫెస్టో కాలం చెల్లిన చెక్కులాంటిదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ ఇప్పటికే ప్రచార పర్వాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఢల్లీిలో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ క్రమంలోనే కమలనాథుల మేనిఫెస్టోపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ మేనిఫెస్టో కాలం చెల్లిన చెక్కులాంటిదని ఎద్దేవా చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు కచ్చితంగా తిరస్కరిస్తారని అన్నారు. ప్రజలు ఏం చేస్తామో చెప్పకుండా ఆ పార్టీ ఎన్నికల రణరంగంలోకి దిగుతోందని ఆరోపించారు. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఏది ఏమైనా ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని స్పష్టం చేశారు.









