AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉద్యోగులకు ‘జీ గ్రూప్’ షాక్!

ప్రముఖ జీ గ్రూప్ సంస్థ ఉద్యోగులకు మరోసారి షాక్ ఇవ్వనుంది. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. గతేడాదిలో మొదలైన ఉద్యోగుల తొలగింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా మల్టీ నేషనల్ కంపెనీలు మొదలు చిన్న చిన్న స్టార్టప్‌ల వరకు ఉద్యోగుల భారాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాయి. తాజాగా జీ గ్రూప్ సంస్థ రెండో దశలో మరికొంత మంది ఉద్యోగులను ఇళ్లకు సాగనంపేందుకు రెడీ అయ్యింది. అయితే సోనీ గ్రూప్ తో విలీన ప్రక్రియ విఫలమైందో అప్పుడే జీ గ్రూప్‌లో ఉద్యోగులకు భయం పట్టుకుంది. ఏ క్షణానైనా ఉద్యోగాలు ఊడతాయని ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు. వారం రోజుల కిందటే జీ గ్రూప్‌లో లే-ఆఫ్స్ మొదలయ్యాయి. ఈ తరుణంలోనే మరికొన్ని రోజుల్లో సెకెండ్ రౌండ్ ఉంటుందనే సంకేతాలు తెరపైకి వచ్చాయి. కాస్ట్-కటింగ్ ప్రాసెస్‌లో భాగంగా గ్రూప్‌లో ఉద్యోగుల సంఖ్యను 15 శాతం తగ్గించుకొని సంస్థను గాడిలో పెట్టాలని చైర్మన్ సుభాష్ చంద్ర భావించారు. అందులో భాగంగానే గత శుక్రవారం రాత్రి మెయిల్స్ పంపించి, శనివారానికి ఆఫీసుల నుంచి వెళ్లగొట్టారు. ఈ ఏడాది మొదటి వారంలో స్వయంగా కంటెంట్ హెడ్, గ్రూప్ లో అత్యంత కీలకమైన పునీత్ మిశ్రా తప్పుకోవడం సంచనంగా మారింది. ఆ వెంటనే కిందిస్థాయి ఉద్యోగుల్ని కూడా జీ గ్రూప్ తొలగించింది.

ANN TOP 10