పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ లోకి వలసలు ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో చేరికల పరంపర జోరుగా కొనసాగుతోంది. ప్రధానంగా పట్టణ మున్సిల్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌కు జై కొడుతూ కంది శ్రీనివాస రెడ్డి పై ఉన్న నమ్మకంతో పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. నేడు ఎంఐఎం పార్టీకి చెందిన 35 వ వార్డు కౌన్సిలర్ ఫౌజియా జాఫర్ అహ్మద్‌తో పాటు పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే ఆదిలాబాద్ రూరల్ అంకోలి, తంతోలి, సొసైటీ గూడ, కచ్ కంటి, జైనథ్ మండలం సాంగ్వి, కరంజి గ్రామాలనుండి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. కరంజి తాజా మాజీ ఉప సర్పంచ్ బిక్కి గంగన్న, మాజీ ఆత్మ డైరక్టర్ దర్శనాల అశోక్, గ్రామ వార్డ్ మెంబర్ బొల్లెం అశోక్‌లతో భారీ సంఖ్యలో పార్టీలో చేరారు. అందరికి కండువాలు కప్పిన కంది శ్రీనివాస రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తనమీద నమ్మకంతో చేరుతున్న వారి నమ్మకాన్ని వమ్ము చేయనని కంది శ్రీనివాస రెడ్డి తెలిపారు. నాయకులు కార్యకర్తలు పాత కొత్త బేధం పెట్టుకోవద్దని కోరారు. అందరం కలసి పని చేద్దామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి ఆత్రం సుగుణను గెలిపించుకోవలసిన చారిత్రక అవసరం మన మీద ఉందన్నారు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మన ఎంపీ అభ్యర్ధిని గెలిపించుకోవాలన్నారు.
దేవుడి పెళ్లికి అందరూ చుట్టాలేలనని, ప్రజల అభివృద్ధి కాంక్షించి వచ్చేవారందరికి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నానని అన్నారు. అందరు కార్యకర్తలను కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండ గంగాధర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, కాంగ్రెస్ అంబేద్కర్ నగర్ కౌన్సిలర్ రషీద్ ఉల్ హాక్, కేఆర్కే కౌన్సిలర్ ఆనంద్, తిర్పెల్లి కౌన్సిలర్ సాయి ప్రణయ్, సుభాష్ నగర్ కౌన్సిలర్ దర్శనాల లక్ష్మణ్, సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, శ్రీ లేఖ, బాయిన్ వార్ గంగా రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పటేల్, నాగర్కర్ శంకర్, గోపిడి రుక్మ రెడ్డి, మైనారిటీ నాయకులు ఎం.ఏ.షకీల్, ఖలీం,రఫీక్, కయ్యుమ్, కొండూరి రవి, అఖిల్,లీగల్ సెల్ చైర్మన్ సంజీవ్ రెడ్డి, బండి దేవిదాస్ చారి, పోరెడ్డి కిషన్, సుధాకర్ గౌడ్, తమ్మల చందు, యాల్ల పోతా రెడ్డి, డేరా కృష్ణ రెడ్డి, దుర్గం శేఖర్, భోజా రెడ్డి, సయ్యద్ షాహిద్ అలీ, పత్తి ముజ్జు, షేక్ మన్సూర్, మానే శంకర్, అంజద్ మహేందర్, రతన్ రెడ్డి,మల్లా రెడ్డి, జగదీష్, అల్లూరి అశోక్ రెడ్డి, బాసా సంతోష్, ఎల్మ రామ్ రెడ్డి, శ్రీ రామ్, ముజ్జు, రవీందర్ రెడ్డి, భూమన్న, పోతన్న, అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు.









