AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కంది సమక్షంలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

(అమ్మన్యూస్, ఆదిలాబాద్‌):
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆత్రం సుగుణను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఆదిలాబాద్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కంది సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఆదిలాబాద్‌ రూరల్, జైనథ్‌ మండలాల నుంచి బీఆర్‌ఎస్‌ నాయకులతో పాటు భారీ సంఖ్యలో గ్రామస్తులు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో నేతలు ఆడే గజేందర్, గోవర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ANN TOP 10