AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లిక్కర్ స్కామ్‌లో కవితది ‘కీ రోల్.. విజయ్‌నాయర్‌తో కలిసి స్కెచ్

వాట్సప్ చాట్‌ను కోర్టుకు అందజేశాం
రూ. 100 కోట్లు సౌత్‌గ్రూప్ నుంచి అప్‌కు
కవిత సూచనతోనే మాగుంటకు రూ. 25 కోట్లు
కోర్టులో సీబీఐ వాదనలు

అమ్మన్యూస్, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితది కీలక పాత్ర అని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ గురువారం అరెస్ట్ చేయగా.. ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హజరుపర్చింది. ఆమెను కస్టడీకి అప్పగించాలని సీబీఐ వేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా రూ.100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు కవిత అందించారని సీబీఐ వాదించింది. లిక్కర్ వ్యాపారులను సీఎం కేజ్రివాల్‌కు కవిత కలిపారని సీబీఐ తరుఫు లాయర్ కోర్టుకు తెలిపారు. కవిత సూచనతోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి రూ. 25 కోట్లు అందజేశారని పేర్కొన్నారు. వాట్సాప్ చాట్‌లు ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని స్పష్టం చేసింది. వాట్సాప్ చాట్ ను కోర్టుకు అందజేశామని సీబీఐ తెలిపారు. బుచ్చిబాబు స్టేట్ మెంట్ ప్రకారం కవితకు.. ఇండో స్పిరిట్ సంస్థలో 33 శాతం వాటా ఉందని తెలిపారు. కవిత పీఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ప్రకారం.. అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు భారీ మొత్తంలో డబ్బు ఆప్ నేతలకు అందించినట్టు తెలిపారు. ఈ విషయాలను చార్జిషీట్లలో పొందుపరిచామని స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంలో కవిత కీ రోల్ పోషించారన్నారని, సౌత్‌కు చెందిన కీలక మద్యం వ్యాపారి కేజ్రీవాల్‌ను కలిశారన్నారు.

సీబీఐ నిబంధనలు పాటించడం లేదు: కవిత తరుపు లాయర్

కోర్టులో కవిత తన వాదన వినిపించారు. తనను అరెస్ట్ చేస్తున్నారనే విషయం జైలు అధికారులు రాత్రి 10:30కి చెప్పారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తనకు లీగల్ సలహా కావాలని తాను అడిగానని, కానీ ఇంతలోనే తనను అరెస్ట్ చేశారని వాపోయారు. కవిత వాదనపై న్యాయస్థానం స్పందిస్తూ.. అరెస్ట్ అప్లికేషన్ ఫైల్‌ను సీబీఐ తమ ముందు పెట్టిందని, వారికి తామే అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది. ఇది కోర్టు పరిధిలోని అంశం అని జడ్జి వెల్లడించారు. కోర్టునే ప్రశ్నించొద్దని కవితకు సూచించారు. అలాగే కోర్టును ప్రశ్నించేలా కౌంటర్ వేయొద్దని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కవిత విషయంలో సీబీఐ నిబంధనలు పాటించడం లేదన్నారు కవిత తరుపున న్యాయవాది. జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా కోర్టు అనుమతి లేకుండా అరెస్టు కుదరదన్నారు. మరోవైపు ప్రాథమిక హక్కులకు ఎలాంటి విఘాతం కలిగించలేదని సీబీఐ పేర్కొంది. జైలు అధికారులకు సమాచారం ఇచ్చామని సీబీఐ తెలిపింది. కవిత భర్తకు కూడా అరెస్టు గురించి చెప్పామని పేర్కొంది.

ANN TOP 10