AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరికాసేపట్లో రౌస్‌ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత

న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మరికాసేపట్లో ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టుకు హాజరు కానున్నారు. ఉదయం 10.30 గంటలకు సీబీఐ ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనుంది. నిన్న తీహార్‌ జైలులో ఉన్న కవితను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారం రోజులపాటు కస్టడీ కోరే అవకాశం ఉంది. అయితే కనీసం నోటీసు కూడా ఇవ్వకపోవడం చట్ట వ్యతిరేకమని కవిత తరఫు లాయర్‌ అన్నారు. సీబీఐ ఎవరికీ తెలియకుండా కోర్టులో అప్లికేషన్లు దాఖలుచేసి అనుమతులు పొందిందని ఆక్షేపించారు.

ప్రస్తుతం తీహార్‌ జైలులో కస్టడీలో ఉన్న కవితను సీబీఐ గురువారం అరెస్టు చేసింది. ఐపీసీ 477, 120(ఆ), పీసీ చట్టం 7 సెక్షన్ల ప్రకారం ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. ఆమెను శుక్రవారం ట్రయల్‌ కోర్టులో హాజరుపర్చనుంది. కాగా కవితను సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆమె తరఫు న్యాయవాది మోహిత్‌రావు గురువారం రౌస్‌ ఎవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రంజాన్‌ సెలవు దినం కావడం, ఈ కేసుకు సంబంధించిన సమాచారం లేదని ప్రతివాదులు చెప్పడంతో ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ సాధ్యం కాదని కోర్టు తెలిపింది. రెగ్యులర్‌ కోర్టులోనే ఈ వివాదాన్ని పరిషరించుకోవాలని సూచించింది.

ANN TOP 10