AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల..

అమరావతి: ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు(AP Inter Exams) విడుదల అయ్యాయి. టర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను కమిషనర్ ఒకే సమయంలో విడుదల చేశారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు http://resultsbie.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు.

బాలికలదే పైచేయి..

ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈసారి ఇంటర్ పాస్ పర్సంటేజ్‌లో బాలికలే పైచేయి సాధించారని ప్రకటించారు పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పిల్లలకు ఈ ఫలితాల వల్ల ఫ్యూచర్ ప్రభావితం కాదన్నారు. తల్లిదండ్రులు ఫలితాలు ఎలా ఉన్నా పిల్లలకు మద్దతుగా ఉండాలని సూచించారు. లైఫ్.. పరీక్ష కన్నా చాలా గొప్పదని పేర్కొన్నారాయన. ఫెయిల్ అని విద్యార్థులకు వెంటనే సప్లై ఉంటుందని, పిల్లలకు మరో అవకాశం ఉంటుందన్నారు.

ANN TOP 10