AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సచివాలయానికి సమీపంలో కారు దగ్ధం.. ట్రాఫిక్‌ జామ్‌..

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సెక్రటేరియట్‌ సమీపంలో గురువారం రాత్రి కారు మంటలు చెలరేగాయి. రన్నింగ్‌ కారులో బ్యానెట్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై కారును నిలిపివేశాడు. అందులో ప్రయాణిస్తున్న వారు వెంటనే ఆపి బయటకు దిగారు. కారులోని విలువైన వస్తువులను సైతం బయటకు తీసుకువచ్చారు. మెయిన్‌రోడ్డులో ప్రమాదం జరుగడంతో భారీ ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గురైన స్విఫ్ట్‌ డిజైర్‌ కారు సెక్రటేరియట్‌లోని ఉద్యోగిదిగా సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఇద్దరు వ్యక్తులు తెలుస్తున్నది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

ANN TOP 10