AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కిన ఎమ్మెల్యే తనయుడు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఓ ఎమ్మెల్యే తనయుడు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎన్నికల అధికారులు ఎన్ని పకడ్బందీ ఏర్పాటుచేసిన గ్రామాల్లోకి డబ్బు ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో చోటుచేసుకుంది. బొపెళ్లి గ్రామంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తనయుడు మర్రి శశిధర్ రెడ్డి డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కాడు. గ్రామంలోని ఆలయంలో వృద్ధులకు దేవాలయానికి సంబంధించిన విరాళం అందిస్తున్నట్టుగా తెలుపుతూ వారికి నోట్ల కట్టలను ముట్ట చెప్పాడని సమాచారం.

ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రతిపక్ష పార్టీ నాయకులు సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టి ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పకడ్బందీగా ఎన్ని చర్యలు చేపడుతున్న గాని పట్టపగలే రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు డబ్బులు పంచుతున్న వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి.

ANN TOP 10