రెండో రోజున జీ20 శిఖరాగ్ర సమావేశాలు మొదలయ్యాయి. ముందుగా ఉదయం పూట రాజ్‌ఘట్ వద్ద మహాత్మగాంధీ స్మృతికి జీ20 నేతలు నివాళులు అర్పించారు. భారత్ మండపంలో ఒకే భవిష్యత్ అంశంపై చర్చలు జరపనున్నారు. మధ్యాహ్నం పలు దేశాధినేతలో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే ఈరోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్‌కు ప్రధాని మోదీ వర్కింగ్ లాంచ్ ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత విడిగా దేశాధినేతతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత కొమొరోస్, తుర్కియే (టర్కీ), యూఏఈ, దక్షిణ కొరియా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కీలక అంశాలపై రంగాల వారీగా ఆయా దేశాలతో భారత్ పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా జీ20 కూటమి అధ్యక్ష హోదాలో భారత్ ఇప్పటికే మొదటి రోజున పెద్ద విజయాన్ని నమోదు చేసింది. అలాగే వివిధ అంశాలపై భాగస్వామ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నా కూడా.. సంయుక్త ప్రకటనపై ఏకాభిఫ్రాయాన్ని సాధించింది. అలాగే ఉక్రెయన్ యుద్ధం అంశంలో కూడా ఉన్నటువంటి చిక్కులను చాకచక్యంగా పరిష్కరించగలిగింది. అలాగే న్యూఢిల్లీ జీ20 లీడర్ డిక్లరేషన్ జీ20 దేశాధినేతల నుంచి ఆమోదం పొందింది. అలాగే దీన్ని సాకారం చేసేందుకు కృషి చేసిన మంత్రులు, షెర్పాలు, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే డిక్లరేషన్ ఇందులో రష్యా పేరును ప్రస్తావించకుండానే ఉక్రెయిన్ అంశంపై జీ20 కూటమి పలు సూచనలు చేసింది. అలాగే అణు బెదిరింపులు తగవని.. ఇది అసలు యుద్ధాల శకం కాదని స్పష్టం చేసింది. ఏమైనా విభేధాలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పింది.









