AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

షాద్‌నగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. కంపెనీలో భారీ పేలుడు

షాద్‌నగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శ్రీనాథ్‌ రోటో ప్యాక్‌ కంపెనీలో పేలుడు చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో మంటలు భారీగా చెలరేగాయి. ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.

అలాగే మరి కొందరిని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్నవారిని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. బూర్గుల శివారులో ఉన్న కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే కంపెనీలో సిలిండర్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ANN TOP 10