శ్రీరాం సాగర్ వట్టిపోతోంది. గతేడాది ఇదే రోజున భారీ వరదతో 34 గేట్లు ఏత్తి పారించిన నీళ్ల దగ్గర ఇప్పుడు నిర్మానుష్యం కనిపిస్తుంది.. 600 టీఎంసీలకు పైగా నీళ్లను గోదవరిలోకి వదిలిన ఎస్సారెస్పీ ఇప్పుడు కనీసం సాగుకు కూడా నీరందివ్వని దీన స్థితికి చేరుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వర ప్రదాయినిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోయింది. వర్షాలు లేకపోవడంతో ఎగువ నుంచి ఎస్సారెస్పీలోకి ఇన్‌ఫో లేదు. నిల్వ ఉన్నది 23 టీఎంసీలు మాత్రమే. శ్రీరాంసాగర్ ప్రొజెక్టులోకి కేవలం స్వల్ప నీటి ప్రవాహం మాత్రమే కోనసాగుతుంది.. మహారాష్ట్ర నుంచి రావాల్సిన వరద పూర్తిగా తగ్గిపోవడంతో డెడ్ స్టోరేజికి చేరువలో ఉంది శ్రీరాం సాగర్. ప్రస్తుతం ఎస్సారెస్పీకి ఇన్ ఫ్లో 12623 క్యూసెక్కులు వస్తుండటంతో ఔట్ ఫ్లో 878 క్యూసెక్కులు ఉంది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1067 ఉంది. నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23 టీఎంసీలు ఉంది%చిచి%కాగా గత సంవత్సరం ఇదే రోజున ఎస్సారెస్పీ నీటి మట్టం 1087అడుగులుగా ఉండి 74 టీఎంసీల తో ప్రాజెక్ట్ నిండు కుండను తలపించింది.
మహరాష్ట్రలో వర్షబావ పరిస్థితులే కారణం
మహరాష్ట్రలో వర్షాభావ పరిస్థితులు దీనికి ప్రదాన కారణంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రతో పాటు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిస్తే ఈ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కానీ ఈ ఏడాది ప్రాజెక్టు ఆయకట్టు లో సరిగ్గా వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండ లేదు. గత ఏడాది లో వచ్చిన వరద కొంత మేరకు ఊరటనిచ్చింది. ఒక్కోరోజు సుమారు 4లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. అప్పుడు కోద్ది రోజుల పాటు లక్ష క్యూసెక్కల ఇన్ ప్లో వచ్చింది. ఈ సంవత్సరం మొత్తానికి 74 టీిఎంసీిల మేర జలాలు చేరాయి. కాగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో యాసంగి పంటల కోసం కాకతీయ కాలువ నుండి సాగు నీటిని విడుదల చేశారు.