ఆస్పత్రిలో దీర్ఘకాలంగా చికిత్స పొందుతున్న వ్యక్తితో అందులో పనిచేసే ఓ నర్సు రిలేషన్ పెట్టుకుంది. ఇదే క్రమంలో వారిద్దరూ అప్పుడప్పుడూ శారీరకంగానూ కలిశారు. అయితే ఒక రోజు ఆస్పత్రిలోని పార్కింగ్ ప్రదేశంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. సదరు రోగితో కారులో శృంగారం చేసిన సమయంలో అతడు కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ నర్సు.. తన తోటి నర్సుకు ఫోన్ చేసి పిలిచింది. అయితే ఆ రోగిని ఆస్పత్రిలోకి తీసుకువెళ్లడం ఆలస్యం కావడంతో మృతి చెందాడు. దీంతో ఆ నర్సు తన ఉద్యోగం కోల్పోయింది. ఈ ఘటన బ్రిటన్‌లోని వేల్స్లో జరిగింది.
అయితే ఆ రోగితో తనకు ఏడాదికి పైగా సంబంధం ఉన్నట్లు విచారణలో నర్సు అంగీకరించింది. అయితే వీరిద్దరి సంబంధం గురించి ఆమె తోటి నర్సులకు కూడా తెలుసని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే వారిలో కొందరు ఆ రోగితో సంబంధాన్ని తెంచుకోవాలని సూచించినా, హెచ్చరించినా.. ఆమె పట్టించుకోలేదని పేర్కొన్నాయి.









