AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. మరో 19 మంది అరెస్ట్

టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. నిన్నే మున్సిపల్ ఏఈ ఎగ్జామ్‌లో 16వ ర్యాంకు సాధించిన వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకోగా.. తాజాగా మరో 19 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. అయితే.. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పోల రమేశ్ నుంచి ఏఈ ఎగ్జామ్ పేపర్ కొన్న వారిని సిట్‌ అధికారులు అరెస్టు చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే.. పోల రమేశ్ తన దగ్గరున్న ఎగ్జామ్ క్వాశ్చన్ పేపర్‌ను 30 మందికి విక్రయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే.. విచారణలో పోల రమేష్ ఇచ్చిన సమాచారంతోనే.. అధికారులు తాజాగా మరో 19 మందిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ అరెస్టులతో కలిపి దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 74 మంది అరెస్టయినట్టైంది.

ఇదిలా ఉంటే.. నిన్న సిట్ అధికారులు ఏఈ పరీక్షలో ఏకంగా 16 ర్యాంక్ హోల్డర్‌ అయిన నాగరాజు అనే యువకుడిని అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురానికి చెందిన నాగరాజు.. పూల రమేష్ నుంచి ప్రశ్నా పత్రాన్ని కొనుగోలు చేసి.. పరీక్ష రాసి 16వ ర్యాంకు సాధించినట్లు అధికారులు గుర్తించారు.

అయితే.. క్వశ్చన్ పేపర్ ఇచ్చినందుకు గానూ పూల రమేశ్‌కు నాగరాజు.. రూ.30 లక్షలు ఇచ్చేందుకు డీల్ మాట్లాడుకున్నాడు. కాగా.. పరీక్షకు ముందు అడ్వాన్స్‌గా కొంత డబ్బును కూడా చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు.. ఈ కేసులో విచారణ సాగుతున్న విషయం దృష్టిలో పెట్టుకుని.. నాగరాజు తన ఫోన్‌ను స్విఛ్‌ ఆఫ్ చేశాడు. కాగా.. పోలీసులు ఎట్టకేలకు.. హైటెక్ మాస్ కాపీయింగ్ విషయంలో ఫోన్‌ డేటా ఆధారంగా విచారణ చేపట్టేందుకు అధికారులు నేరుగా నాగరాజు ఇంటికే పోలీసులు వెళ్లారు. అతడిని ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ANN TOP 10