AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పురుషాంగాన్ని కోసుకుని ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య

జగద్గిరిగుట్టలో దారుణమైన ఘటన
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఎంబీబీఎస్ విద్యార్థి అత్యంత దారుణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. పాపిరెడ్డి నగర్.. రోడ్ నెంబర్ 18లో ఉంటున్న దీక్షిత్ రెడ్డి ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఆదివారం (జులై 9న) రాత్రి పూట.. దీక్షిత్ రెడ్డి తన పురుషాంగాన్ని కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్న దీక్షిత్ రెడ్డిని చూసిన ఇరుగుపొరుగువాళ్లు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా.. దీక్షిత్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.

ANN TOP 10