తెలంగాణ సీఎం కేసీఆర్.. లష్కర్ బోనాల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్.. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి చూసుకున్నారు.
తెలంగాణ లష్కర్ బోనాలు ఇవాళ ఉదయం 4 గంటలకు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వచ్చారు. ఉదయం 4 గంటల నుంచే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పిస్తున్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్… కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ప్రతీ సంవత్సరం ఇది ఆనవాయితీగా వస్తోంది.









