AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం..

జాతీయ కార్యవర్గంలోకి బండి సంజయ్, సోము వీర్రాజు..
ఎన్నికలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకువెళ్తోంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర కమిటీల్లో మార్పులు, చేర్పులు చేసింది. దీనిలో భాగంగా బండి సంజయ్ స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సోము వీర్రజు స్థానంలో ఏపీ బీజేపీ చీఫ్ గా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించింది.

అయితే, బండి సంజయ్, సోము వీర్రాజుకు బీజేపీ సముచిత స్థానాన్ని కల్పిస్తుందని, ఆ దిశగా చర్యలు ప్రారంభమయ్యాని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, అంతా అనుకున్నట్లే.. తెలుగు రాష్ట్రాల బీజేపీ మాజీ చీఫ్ లు బండి సంజయ్, సోము వీర్రాజుకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి బండి సంజయ్‌, సోము వీర్రాజును చేర్చుతూ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. వీరితోపాటు.. దేశవ్యాప్తంగా పదిమందికి జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం రాత్రి ప్రకటనను విడుదల చేశారు. జాతీయ కార్యవర్గంలో పది మందిని నియమిస్తు్న్నట్లు పేర్కొన్నారు.

ANN TOP 10