AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ కీర్తి ఢీల్లీ తాకుతుందని భయపడే మోదీ ఆరోపణలు..

వరంగల్‌లో సీఎం కేసీఆర్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్‌కు వచ్చిన మోడీ తెలంగాణాకు మొండి చేయి ఇచ్చి, అక్కసు వెళ్లగక్కి వెళ్ళారని అన్నారు. కేసీఆర్ కీర్తి ఢీల్లీ తాకుతుందని మోడీకి భయమన్నారు. అవినీతిలో కాంగ్రెస్‌ను మించిపోయిన బీజేపీ.. గుజరాత్‌లో కూలిన బ్రిడ్జిలే బీజేపీ అవినీతికి సాక్ష్యమన్నారు. తెలంగాణ ప్రజల చైతన్యానికి నిదర్శనమే బీజేపీకి ఇక్కడ స్థానం లేకపోవడమే అని చెప్పుకొచ్చారు. ఆ మాత్రం వ్యాగన్ తయారీ చేసుకునే సత్తా తమకు ఉందన్నారు. అవినీతికి రాజు కాంగ్రెస్ అయితే రారాజు బీజేపీ అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ పని అంటూ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

ANN TOP 10