వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. మంగళవారం ఐసిసి ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 5నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. లీగ్ దశలో ప్రతి జట్టు 8 మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 8న చెన్నై వేదికగా టీమిండియా తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అక్టోబర్ 11న ఢిల్లీలో అఫ్ఘనిస్థాన్, అక్టోబర్ 15న అహ్మదాబాద్ లో పాకిస్థాన్, అక్టోబర్ 19న ఫుణెలో బంగ్లాదేశ్, అక్టోబర్ 22న ధర్మశాలలో న్యూజిలాండ్, అక్టోబర్ 19న లఖ్‌నవూలో ఇంగ్లండ్, నవంబర్ 5న కోల్‌కతాలో దక్షిణాఫ్రికా జట్లతో భారత్ తలపడనుంది.
ఇక, నవంబర్ 10న ముంబైలో తొలి సెమీఫైనల్, నవంబర్ 16న కోల్‌కతలో రెండో సెమీఫైనల్ మ్యాచ్ లు జరుగనున్నాయి. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా, హైదరబాద్ ఉప్పల్ స్టేడియంలో మొత్తం మూడు ప్రపంచకప్ మ్యాచులు జరగనున్నాయి.
48 మ్యాచులు, 46 రోజులు, 12 వేదికలు, 10 జట్లు.. ఐసీసీ 2023 వన్డే వరల్డ్‌కప్ వేటకు నగారా మోగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ షెడ్యూల్ రానే వచ్చింది. భారత్ ఆతిథ్యం ఇస్తున్న 2023 వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను మంగళవారం ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐసీసీ, బీసీసీఐ ప్రకటించాయి. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ట్రోఫీని గగనతలంలోకి తీసుకెళ్లి అభిమానుల్లో జోష్ తీసుకొచ్చిన బీసీసీఐ.. మెగా ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ.. వరల్డ్‌కప్ 100 రోజుల కౌంట్‌డౌన్‌ను షురూ చేసింది.









