AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పు.. తరువాత ఎవరంటే..!

ఢిల్లీ : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను అధిష్టానం మార్చబోతోందని సమాచారం. బండి సంజయ్ మార్పుపై ఢిల్లీలో ఊహాగానాలు వినవస్తున్నాయి. తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేరు వినిపిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడైతే బండి సంజయ్ కేంద్ర మంత్రి అవుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బండి సంజయ్.. ఢిల్లీలోనే మకాం వేశారు. బీజేపీ అగ్ర నేతలతో గత రెండు రోజులుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈటల, రాజగోపాల్ రెడ్డిలతో నడ్డా, అమిత్ షాల చర్చల తరువాత తెలంగాణ బీజేపీలో మార్పులపై అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. కిషన్ రెడ్డి సారథ్యంలో కొత్త టీం ఏర్పాటుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ANN TOP 10