AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చక్కెర ధరల సెగ..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!

చక్కర ధరల పెరుగుదలపై కేంద్రం ప్రభుత్వం స్పందించింది. భారత్‌లో ఇప్పటికే భారీగా చక్కెర ధరలు పెరిగాయి. దీంతో జూలై 20న కిలో చక్కెర ధర దాదాపుగా రూ.48.18 పలికింది. దీంతో ఆగస్టు 20న రూ.55.70కి చక్కెర ధర పెగింది. కేవలం నెల రోజుల్లో కిలో చక్కెరపై రూ.7.52 పెరిగింది.

చక్కెర ధరల పెరుగుదలపై కేంద్రం నిశితంగా పర్యవేక్షిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వినియోగదారులకు చక్కెర అందుబాటులో ఉండేలా కేంద్రం చర్యలు తీసకుందని తెలిపింది. ఇథనాల్‌కు చక్కెర మళ్లించడం వల్ల ధరలు పెరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇథనాల్ కారణంగానే చక్కెర ధరలు పెరిగాయనడం సరికాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

పండుగల సీజన్ నేపథ్యంలో డిమాండ్ పెరగడం మరో కారణం అని కేంద్రం తెలిపింది. వాతావరణ ప్రభావంతో చెరకు పంటకు నష్టం జరిగిందని కేంద్రం తెలిపింది. దేశంలో ఉత్పత్తి తగ్గినా దేశంలో తగినంత చక్కెర నిల్వలు ఉన్నాయని తెలిపింది. అక్టోబర్‌లో కొత్త చెరకు క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యే వరకు దేశీయ డిమాండ్‌కు సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా కూడా చక్కెర ధరలు పెరుగుతున్నాయని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

ANN TOP 10