AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ.264 కోట్లు..!

హైదరాబాద్ భూముల ధరలు మరోమారు రికార్డును తిరగరాశాయి. తాజాగా రాయదుర్గం ప్రాంతంలో తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహించిన వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లు పలికింది. రాయదుర్గం పరిధిలోని పాన్‌మక్తాలో సర్వే నంబర్‌ 83/1 (Plot No.1)లోని 5.25 ఎకరాల భూమికి వేలం వేయగా.. ఈ ధర వచ్చింది. ఎకరాకి రూ.264 కోట్ల చొప్పున లెక్కగడితే మెుత్తం భూమి ఏకంగా రూ.1,386 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం.

రాయదుర్గంలోని ఈ అత్యంత విలువైన స్థలాన్ని ‘ఎంఎస్ఎన్ రియల్టీస్’ సంస్థ దక్కించుకుంది. ఈ భూమిని తగ్గించుకునేందుకు వేలంలో ఎంతో మంది పోటీ పడగా.. చివరకు అధిక ధర చెల్లించి ఈ సంస్థ సొంతం చేసుకోవడం గమనార్హం. రాయదుర్గంలోని భూములకు ఈ స్థాయి ధర లభించడం పట్ల ఐటీ, రియల్ ఎస్టేట్ వర్గాలతో పాటు సామాన్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు

ANN TOP 10