AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వరంగల్‌లో నకిలీ విత్తనాల గుట్టు రట్టు..

పోలీసులు వరంగల్‌లో నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టు చేశారు. భారీ మొత్తంలో నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. 15 మంది నిందితులను అరెస్టు చేశారు. రూ. రెండు కోట్లకుపైగా విలువచేసే పత్తి నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. 12 వందల టన్నుల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రింట్ మిషన్, బ్యాగ్స్, పేపర్స్, క్యూ ఆర్ కోడ్ తదితర వాటిని స్వాధీనం చేసుకున్నారు. పత్తి విత్తనాలను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేయకుండా కేవలం జిన్నింగ్ మిల్లులోంచి తీసుకుని వాటికి రంగేసి పెద్ద మొత్తంలో విక్రయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో పత్తి విత్తనాల విక్రయాలు జరిగాయి. రైతులు కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు. అయితే కొనుగోలు చేసిన రైతులు తిరిగి ఇవ్వాలని, విత్తనాలను పొలంలో వేసుకోవద్దని పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

ANN TOP 10