మృగశిర కార్తె సందర్బంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిన కుటుంబం అందించే చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు (శుక్రవారం) ఉదయం 7 గంటలకు చేప ప్రసాదం పంపిణి ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం కోసం ఏర్పాట్లు చేశారు. ప్రయాణీకుల కోసం 9, 10వ తేదీలు (రెండు రోజులు) ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ఎయిర్ పోర్టు వంటి ప్రాంతాల నుంచి దాదాపు 50 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతల నుంచి 80 బస్సులు ఏర్పాటు చేశారు.









