ఆరుగురు కార్మికులు మృతి..
ఈదురుగాలులకు కదిలిన గూడ్స్ రైలు బోగీలు..
ఒడిశాలో వరుసగా రైలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్,హౌరా బెంగళూరు ఎక్స్‌ప్రెస్ లు బాలాసోర్ వద్ద ఘోర ప్రమాదంలో 300 మందికి పైగా చనిపోయిన విషయం విదితమే. తాజాగా మరో రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడి ఝాజ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. గూడ్స్ రైలుకు చెందిన నిరుపయోగ బోగీ చక్రాల కింద నలిగి ఆరుగురు కార్మికులు మృతి చెందగా..మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.









