అంకారా: టర్కీలో తుఫాను (Storm) బీభత్సానికి ఓ ఇంట్లో ఉన్న సోఫా అమాంతం ఆకాశంలోకి ఎగిరిపోయింది. బలమైన గాలుల ధాటికి కొద్దిదూరం ఎగురుకుంటూ వెళ్లి ఓ భవనానికి బలంగా తాకింది. అవునండీ ఇది నిజమే.. అయితే ఇది జరిగింది మనదగ్గర కాదులేండి.. టర్కీలో (Turkey). ఫిబ్రవరిలో భూకంపంతో విలవిళ్లాడిన టర్కీ ఇప్పుడు భారీ వర్షాలు, ఈదురుగాలులతో వణికిపోతున్నది.
దేశ రాజధాని అంకారాలో (Ankara) ఈదురు గాలుల ధాటికి ఏకంగా సోఫాను కొట్టుకుపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నది. సోఫా గాలిలో ఎగురుకుంటూ వస్తున్న వీడియో ఫుటేజీని గురు ఆఫ్ నథింగ్ అనే ఖాతాదారుడు ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అంకారాలో కురిసిన తుఫాను వల్ల పలు సోఫాలు గాలిలో ఎగిరిపోతున్నాయంటూ రాసుకొచ్చాడు.
తుఫాను (Storm) బీభత్సానికి ఓ ఇంట్లో ఉన్న సోఫా అమాంతం ఆకాశంలోకి ఎగిరిపోయింది. బలమైన గాలుల ధాటికి కొద్దిదూరం ఎగురుకుంటూ వెళ్లి ఓ భవనానికి బలంగా తాకింది. అవునండీ ఇది నిజమే.. అయితే ఇది జరిగింది మనదగ్గర కాదులేండి.. టర్కీలో ఫిబ్రవరిలో భూకంపంతో విలవిళ్లాడిన టర్కీ ఇప్పుడు భారీ వర్షాలు, ఈదురుగాలులతో వణికిపోతున్నది. దేశ రాజధాని అంకారాలో (Ankara) ఈదురు గాలుల ధాటికి ఏకంగా సోఫాను కొట్టుకుపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నది. సోఫా గాలిలో ఎగురుకుంటూ వస్తున్న వీడియో ఫుటేజీని గురు ఆఫ్ నథింగ్ అనే ఖాతాదారుడు ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అంకారాలో కురిసిన తుఫాను వల్ల పలు సోఫాలు గాలిలో ఎగిరిపోతున్నాయంటూ రాసుకొచ్చాడు.









