
నేటితరం ఆడియన్స్ మెచ్చే నటనతో పలు సూపర్ హిట్ సినిమాల్లో భాగమైన రష్మిక మందన్న.. సోషల్ మీడియాలో కూడా హవా నడిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండతో చేసిన గీతగోవిందం, మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో చేసిన భీష్మ సినిమాలు ఆమె కెరీర్‌కి పూల బాటలు వేశాయి. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ వేర్ లో ఉన్న కొన్ని పిక్స్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి.









