AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విద్యా విధానంలో సమూల మార్పులు అవసరం

వరంగల్‌లో హర్యానా రాష్ట్ర గవర్నర్ దత్తాత్రేయ పర్యటన
హర్యానా (Haryana) రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ (Governor Bandaru Dattatreya) శుక్రవారం వరంగల్‌లో పర్యటించారు. మాజీ మేయర్ రాజేశ్వరరావును పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో నూతన విద్యా విధానం (New Education System) అమలు చేయాలని అన్నారు. పేదరికం నిర్మూలన కావాలంటే.. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకుని రావాలని.. అందరికీ విద్యను అందించాలని వ్యాఖ్యానించారు. దేశంలో పేదరిక నిర్మూళన కోసం కేంద్ర ప్రభుత్వం నూతన విధానం అమలు చేస్తోందని.. 2030 నాటికి దేశంలో నూతన విద్యా విధానం అమలు చేయాలనేది ప్రధాని మోదీ (PM Modi) లక్ష్యమని.. హర్యానా రాష్ట్రంలో 2025 నాటికి నూతన విద్యా విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని గవర్నర్ బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు.

ANN TOP 10