దళిత బంధుపై జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. దళిత బంధు అత్యంత అవినీతిమయం అయ్యిందని ఆరోపించారు. అవినీతి చేసిన ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఏసీబీ (ACB) పరిధిలోకి వచ్చే ప్రజాప్రతినిధులపై చర్యలేవీ అంటూ నిలదీశారు. రాజయ్యపై ఆరోపణ వస్తేనే ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారని మండిపడ్డారు. దళిత జాతిని కేసీఆర్ (CM KCR) అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి చేస్తే అడ్డంగా నరకుతా అన్న కేసీఆర్‌కు ఎవరు అడ్డొస్తున్నారని అడిగారు. ఎమ్మెల్యేల తాట తీయడానికి కేసీఆర్‌కు భయమెందుకు అని ప్రశ్నించారు. దళిత బంధు అవినీతికి కేసీఆర్ దే బాధ్యత అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.









