AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తిరుమల భక్తులకు శుభవార్త…

వందే భారత్ రైలు బోగీలు డబుల్
సికింద్రాబాద్‌-తిరుపతి రూట్‌లో నడుస్తున్న వందే భారత్‌ రైలుకు తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ రైలులో 8 బోగీలు మాత్రమే ఉండటంతో ప్రయాణికులకు రిజర్వేషన్‌ లభించట్లేదు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో చూస్తే మరో 10 రోజుల వరకు వెయిటింగ్‌ లిస్ట్‌ కనిపిస్తోంది.

సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ రైలులో బోగీల సంఖ్యను పెంచేందుకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చొరవ తీసుకున్నారు. బోగీల సంఖ్య ఎందుకు తగ్గించారని ఆయన రైల్వే అధికారుల్ని ప్రశ్నించారని, 16 బోగీలతో ఈ వందే భారత్‌ రైలు నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారుల్ని ప్రశ్నించారని వార్తలొస్తున్నాయి.

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆదేశాలతో త్వరలోనే సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ రైలును 16 బోగీలతో నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేస్తోంది. అంటే ప్రస్తుతం ఉన్న బోగీల సంఖ్య డబుల్‌ అవుతుంది. అయితే ఎప్పట్లోగా అదనపు బోగీలు అందుబాటులోకి రానున్నాయి.

ANN TOP 10