AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘ఇరుముడి’ ట్రైలర్.. రూటు మార్చిన రవితేజ..! ఈసారైనా హిట్ కొడతాడా..?

ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ (Siva nirvana) దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ (Raviteja) , ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar) జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్, యాక్షన్ థ్రిల్లర్ ఇరుముడి. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. గత కొంతకాలంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఎట్టకేలకు సరైన సక్సెస్ కోసం జానర్ మార్చి.. యాక్షన్ , థ్రిల్లింగ్ అంశాలను జోడిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై ఊహించని అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా ట్రైలర్ చూశాక.. ఇరుముడికి ముందు ఇరుముడి తర్వాత అనే రేంజ్ లో ఆయన నటించారని తెలుస్తోంది. ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తూ భార్య, కూతురే ప్రాణంగా బతికే ఒక మధ్య తరగతి తండ్రి కథే ఈ ఇరుముడి . స్టార్టింగ్ లో మధ్యతరగతి ఫ్యామిలీ చుట్టూ సాగిన స్టోరీ ఆ తర్వాత థ్రిల్లింగ్, క్లైమాక్స్ కు వచ్చేటప్పటికి ఎమోషనల్ గా ట్రైలర్ కట్ చేశారు.

కూతురు కోరిక మేరకు మందు మానేయాలని అయ్యప్ప మాల ధరిస్తాడు. కఠినమైన దీక్ష తీసుకున్న తండ్రి 41 రోజులు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు? శాంతంగా ఉండాల్సిన తండ్రి ఎందుకు కత్తి పట్టాల్సి వచ్చింది ? ఎలాంటి సంఘర్షణలకు లోనయ్యాడు? ముఖ్యంగా స్కూల్లో చిన్నారుల హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ హత్యలు తాలూకా వెనుక ఉన్న కుట్ర ఏమిటి ? ఈ కుట్రల నుండి తన కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో మనకు అర్థమైన స్టోరీ ఏంటి? అనే విషయానికి వస్తే ప్రశాంతమైన ఊరిలో ఒక మధ్య తరగతి కుటుంబం రవితేజది. కూతురంటే ప్రాణమిచ్చే తండ్రి. తండ్రి కోసం ప్రాణం పెట్టే కూతురు.. ప్రతిరోజు స్కూల్ కి వెళ్లేటప్పుడు , వచ్చేటప్పుడు ఆ గ్యాప్ లో తన చూసింది, విన్నది తండ్రికి పూస గుచ్చినట్లు చెప్పే కూతురు.. అనుకోకుండా ఊరిలోని స్కూల్లో ఆడపిల్లల వరుస మరణాలు.. దాని వెనుక ఉన్న మిస్టరీ ప్రధాన అంశంగా ఈ ఇరుముడి చిత్రాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ కూడా భారీగా ఆకట్టుకుంటున్నాయి.మొత్తానికైతే మాస్ మహారాజా తొలిసారి జానర్ మార్చి ఎట్టకేలకు మరో కొత్త స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

ANN TOP 10