ఎప్పుడు ఏదో ఒక కామెంట్‌తో నిత్యం వార్తల్లో నిలిచే తెలంగాణ హైల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు…కొత్తగూడెం ఇఫ్తార్ విందులో తాయత్తు మహిమ వల్లే తాను బతికానని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. మనిషిని నమ్మకమే బతికిస్తుందని గుర్తుచేసుకున్నానని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీని తక్కువ చేసి ఏనాడు మాట్లాడలేదంటూ.. నమ్మకంతో మనిని నవనాగరిక సమాజాన్ని నిర్మించుకుంటున్నాడని తెలిపాడు.కరోనా సమయంలో మందులు, వ్యాక్సిన్లు ఇచ్చామే గాని.. తాయత్తులు కట్టుకోమని ఏనాడు చెప్పలేదంటూ.. పూర్వం ఉన్న నమ్మకాన్ని గుర్తు చేశానన్నారు. కనిపిస్తున్న సత్యం ఆవగింజ అయితే… కనిపించని నమ్మకం విశ్వమంతంటూ.. నమ్మకం కాస్త మూఢ నమ్మకంగా మారి కనుమరుగైందని వివరణ ఇస్తూ.. తన వ్యాఖ్యలను ఇంత వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ డైరక్టర్ డా. గడల శ్రీనివాసరావు తెలిపారు.









