టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడివి దిగజారుడు రాజకీయాలని మంత్రి మేరుగు నాగార్జున విమర్శలు గుప్పించారు.14 ఏళ్లు సీఎంగా ఉన్నా రాష్ట్రానికి ఒక్క మంచి పని చేయలేదని ఆరోపించారు. అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర ఆయనదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా భయంతో పక్క రాష్ట్రానికి పారిపోయారని, ఇప్పుడు అధికార యావతో రాష్ట్రంలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం చేస్తామంటున్న చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మరన్నారు.









