హైదరాబాద్‌లోని మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పుష్ప`2 సినిమాతో పాటు నిర్మాణంలో ఉన్న సినిమాలు, నటీనటుల రెమ్యూనరేషన్లు, ఇతర వివరాలపై ఆరా తీస్తున్నారు. సినిమాల్లో వచ్చిన లాభాలతో హైదరాబాద్ చుట్టుపక్కల నిర్మాతలు భారీగా భూములు కొన్నట్లు ఆరోపణలొచ్చాయి.









