సీఎం జగన్ ఒక రోబో అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఆయన కేవలం కేసుల కోసమే ఢల్లీి వెళుతున్నారని ఆక్షేపించారు. 22 మంది ఎంపీల బలం ఉండి రాష్ట్రానికి ఏం మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం ఉందన్నారు. సీఎస్‌కు కూడా ఖజానాలో డబ్బులు లేవని అంగీకరించారని తెలిపారు. స్టీల్ ఫ్లాంట్‌పై కేసీఆర్‌కు ఉన్న నిబద్ధత కూడా జగన్‌కు లేదని ఆయన మండిపడ్డారు.









