AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భాగ్యనగరంలో నరబలి

భాగ్యనగరంలో నరబలి సంచలనం సృష్టిస్తోంది. అమావాస్య వేళ ఓ హిజ్రా ఇంతటి దారుణానికి పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది. నగరంలోని సనత్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ హిజ్రా 8 ఏళ్ల బాలుడిని హత్య చేసింది. ఈ ఘటనలో బలైన బాలుడు అబ్దుల్‌ వహీద్‌గా గుర్తించారు. అమావాస్య వేళ బాలుడిని హత్య చేయడంతో నరబలి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ నాలా సమీపంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. దీంతో కోపంతో ఊగిపోయిన స్థానికులు హిజ్రా ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. స్థానికుల ఆందోళనతో సనత్‌నగర్‌లోని అల్లాదున్ కోటి ఏరియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ANN TOP 10