నగరంలోని సనత్‌నగర్‌లో ఎనిమిదేళ్ల బాలుడి మృతిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas yadav) స్పందించారు. బాలుడి మృతి చాలా బాధాకరమని ఆవేదన చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి పోలీసుల అధికారులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. దోషులు ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.









